![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో.... ఒక బ్రాంచ్ ఆఫీస్ బాధ్యతలు కళ్యాణ్ కి ఇవ్వాలని రాజ్ అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని వచ్చి కళ్యాణ్ కి ఇవ్వబోతుంటే.. వద్దు అన్నయ్య, నిన్నటి వరకు ఇష్టం లేని పని నటిస్తూ బ్రతికాను కానీ ఇక అలా చెయ్యనని కళ్యాణ్ అంటాడు. మరి ఇప్పుడు ఎక్కడకి వెళ్తాన్నావని రాజ్ అడుగుతాడు. నేను రాసిన కవితలు ప్రచరణ చెయ్యమని అడగడానికి వెళ్తున్నానని కళ్యాణ్ అంటాడు.
ఆ తర్వాత ఎవరి దగ్గరికి ఎందుకో వెళ్లడం మనమే ప్రచురణ చేద్దామని రాజ్ అంటాడు. వద్దన్నయ్య నా కవితలు నచ్చి చేయాలి కానీ ఇలా వద్దని కళ్యాణ్ అంటాడు. అంటే నన్ను బాధపెట్టాలని అనుకుంటున్నావా కళ్యాణ్ తో అనామిక అనగానే.. నిన్ను బాధపెడుతున్నా.. నువ్వు నా మనసు ముక్కలు చేసావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత నీకు నచ్చింది చెయ్ నా ఫుల్ సపోర్ట్ నీకేనని ప్రకాష్ అంటాడు.. ఆ తర్వాత అందరు కళ్యాణ్ కి అల్ ది బెస్ట్ చెప్తారు. కాసేపటికి ఒకతన్ని కళ్యాణ్ కలిసి కవితలు చూపిస్తాడు. బాగున్నాయ్ కానీ ఇప్పుడు ఇలాంటివి ఎవరు చదవడం లేదని అతను అనగానే డిస్సపాయింట్ అవుతాడు. మీరు ఓక కథ రాయండి అని అతను చెప్తాడు. నేను కవితలు మాత్రమే రాస్తానని కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు కళ్యాణ్ గురించి రాజ్ ఆలోచిస్తుంటే కావ్య వచ్చి.. ఈ వీసా అప్లికేషన్ ఫామ్ ఫీల్ చెయ్యండి అని అడుగుతుంది. నేను చేయను మీ బావని చేయమని రాజ్ అనగానే.. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఒక దగ్గర ఆగి కొబ్బరి బొండం తాగుతాడు. క్యాష్ లేకుంటే అప్పు వచ్చి డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత అప్పుకి కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు.. నువ్వు ఏంటో ప్రూవ్ చేసుకో అప్పుడు అనామిక నమ్ముతుందని అప్పు చెప్తుంది.
ఆ తర్వాత కావ్య, భాస్కర్, ఇందిరాదేవిలు.. రాజ్ అసలు ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదని ఒక ప్లాన్ చేస్తారు. నువ్వు మీ బావ కలిసి మీ ఇంటికి వెళ్ళండి. అప్పుడు వాడు జెలస్ ఫీల్ అయి మీ వెంట వస్తాడని ఇందిరాదేవి అనగానే.. రాజ్ దగ్గరకి కావ్య వెళ్లి మా పుట్టింటికికి వెళ్తానని అనగానే.. హమ్మయ్య అది వెళిపోతే వాడు ఇక్కడే ఉంటాడనుకుని సరే అంటాడు. వెళ్లి బట్టలు సర్దుకో నేను కూడా సర్దుకుంటా అని అక్కడే ఉన్న భాస్కర్ అనగానే.. నువ్వు ఎక్కడికి అని రాజ్ షాక్ అవుతాడు. మీతో పాటు నేను కూడా వస్తానని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో కావ్య, రాజ్, భాస్కర్ లు కనకం-కృష్ణమూర్తిల ఇంటికి వస్తారు. అక్కడ భాస్కర్ ని కనకం అల్లుడని పిలుస్తుంటే రాజ్ జెలస్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |